హైదరాబాద్ లో బయో ఏసియా సదస్సు
బయో టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అతిపెద్ద సదస్సు బయో ఆసియా 19వ ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే ఈ గ్లోబల్ సదస్సును ఈ నెల 24 నుంచి నిర్వహించనున్నారు. ఈ సదస్సులో 70కి పైగా దేశాల నుంచి 30 వేల మంది లైఫ్ సైన్సెస్ ప్రతినిధులు పాల్గొనున్నారు. 7 ప్యానెళ్ల నుంచి 50 మంది స్పీకర్లు ప్రసంగించనున్నారు. వీటిలో 2 కీనోట్ ప్రసంగాలున్నాయి. ఈసారి వర్చువల్ విధానంలో సదస్సు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ప్యూచర్ రెడీ థీమ్‌తో నిర్వహించనున్న సదస్సులో ప్రభుత్వం, ఇండస్ట్రీ, అకాడమీ నుంచి లైఫ్ సైన్సెస్ ప్రతినిధులు పాల్గొంటారు. ఇందులో లైఫ్ సైన్సెస్ రంగ ప్రస్తుత గమనం, సవాళ్లు, భవిష్యత్తులో వృద్ధి అవకాశాలపై తమ అభిప్రాయలు పంచుకోనున్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు హబ్‌గా ఎదుగుతోన్న హైదరాబాద్ నగర జైత్ర యాత్రలో బయో ఆసియా సదస్సు కీలకపాత్ర పోషిస్తోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ సత్తా చాటేందుకు ఇదొక చక్కని వేదిక అని పేర్కొంటూ బయో ఆసియా 2022 సదస్సులో పాల్గొనే ప్రతినిధులకు మంత్రి స్వాగతం పలికారు.













