జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్కు మరో దెబ్బ … కాంగ్రెస్ గూటికి జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్
జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్కు మరో దెబ్బ తగిలింది. ఇటీవలే మాజీ మేయర్, బీఆర్ఎస్ నేత బొంతు రామ్మోహన్ కాంగ్రెస్లో చేరడానికి రంగం సిద్ధం చేసుకోగా, తాజాగా డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, ఆమె భర్త శోభన్ రెడ్డి కూడా అదే బాటపట్టారు. వీరిద్దరూ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచచం అందజేశారు. జీహెచ్ఎంసీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు శ్రీలత ఈ సంద్భంగా తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా శోభన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నట్లు తెలిసింది.













