నామినేషన్ వేసిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్లు ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తొలిరోజే నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నేరుగా హుజూరాబాద్ చేరుకున్నారు. ఆర్డీఓ కార్యాలలయంలో శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయన వెంట ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు పెద్దిరెడ్డి తదితరులు ఉన్నారు.













