మేం గేట్లు తెరిస్తే ఆ పార్టీలో ఎవరు మిగలరు : గంగుల
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కేసీఆర్‌తోనూ ఉన్నారని, ఎవరూ కాంగ్రెస్‌లో చేరరని ఆ పార్టీ సీనియర్ నేత, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ భవన్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో జరిగింది. అనంతరం గంగుల మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ను వదిలి ఎవరూ వెళ్లిపోరు. కాంగ్రెస్ వాళ్లు ఒక్కరిని తీసుకెళ్తే, బీఆర్ఎస్లోకి పది మంది వస్తారు. మేం గేట్లు తెరిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బీఆర్ఎస్లోకి వచ్చే పరిస్థితి ఉంది. పదేళ్లు అధికారంలో ఉన్నాం. మాకు అధికారం ముఖ్య కాదు. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం అలా మాట్లాడి ఉండొచ్చు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాం. డిసెంబర్ 9వ తేదీనే రైతు బంధు వేస్తామని చెప్పారు. ఇంకా ఎందుకు పడలేదు? రైతుబంధు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడిన నెల రోజుల్లోనే ఇంత వ్యతిరేకత ఎప్పుడూ చూడలేదు. కాంగ్రెస్ అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచింది. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. బీఆర్ఎస్ను సంస్థాగతంగా బలోపేతం చేయడంపై చర్చిస్తున్నాం అని అన్నారు.













