ఆ భయంతోనే ఈటల రెండు చోట్ల ..మంత్రి గంగుల
బీజేపీ నేతల ఈటల రాజేందర్‌కు దమ్ముంటే ఒక్క గజ్వేల్ నుంచి మాత్రమే పోటీ చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లా చింతకుంటలో మంత్రి మాట్లాడుతూ హుజూరాబాద్‌లో కూడా ఈటల బరిలోకి నిలుస్తున్నారంటే ఆయన భయపడ్డారా? అని ఎద్దేవా చేశారు. బీజేపీకి తెలంగాణలో గుండు సున్నా వస్తుందని, ఆ భయంతోనే ఈటల రెండు చోట్ల పోటీ చేస్తానని అంటున్నారని విమర్శించారు. ఏపీ నేతలైన వైఎస్ షర్మిల, కేఏ పాల్, కేవీపీ రామచందర్ రావు, కిరణ్ కుమార్ రెడ్డిలకు తెలంగాణలో ఏం పని అంటూ ప్రశ్నించారు. వారిని అసలే నమ్మొద్దని బీజేపీ ముసుగులో వచ్చిన తెలంగాణను తిరిగి ఆంధ్రాలో కలపాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.













