మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ఇక లేరు

ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్(59) కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్‌లోని తన నివాసంలో అస్వస్థతకు గరికావడంతో కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా, మార్గమధ్యంలో ఇచ్చోడ వద్ద తుది శ్వాస విడిచారు. టీడీపీ తరపున 1999లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా రమేష్ రాథోడ్ ఎన్నికయ్యారు. 2009లో ఆ పార్టీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా టీడీపీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతర పరిణామాల్లో కాంగ్రెస్‌లో చేరి 2019లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లారు. ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించారు. రమేష్ రాథోడ్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.