పట్టభద్రులు కూడా మోదీ వైపే : ఈటల

తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తక్కువ సమయంలోనే వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి 12 లోక్‌సభ స్థానాలు వస్తాయన్నారు. నల్గొండ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రులు కూడా మోదీ వైపే చూస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ను గెలిపించాలని ఈటల కోరారు.