అమెరికా మార్కెట్లోకి డాక్టర్ రెడ్డిస్ ఔషధం
హైదరాబాద్ కేంద్రస్థానంగా పనిచేస్తున్న డాక్టర్ రెడ్డీస్ అమెరికా మార్కెట్లోకి మరో ఔషధాన్ని ప్రవేశపెట్టింది. క్యాన్సర్ వ్యాధిని నియంత్రించే సోరాఫెనిబ్ ట్యాబ్లెట్‌కు అక్కడి నియంత్రణ మండలి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) అనుమతించడంతో అక్కడి మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెరికాలో 2021లో ఈ ఔషధం దాదాపు 70 మిలియన్ డాలర్ల (సుమారు రూ.550 కోట్ల) అమ్మకాలను నమోదు చేసింది. సొరఫెనిబ్ 200 ఎంజీ ట్యాబ్లెట్‌ను ఈ నెల ప్రారంభంలో హైదరాబాద్‌కు చెందిన నాట్కో ఫార్మా కూడా అమెరికాలో విడుదల చేసిన విషయం విదితమే.













