అందుబాటులోకి 2డీజీ ఔషధం..

కోవిడ్ చికిత్సలో వాడే ఔషధం 2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ)ను మరింత విస్త•త స్థాయిలో మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తున్నట్టు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ప్రకటించింది. ఈ ఔషధాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రధానమైన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది. రానున్న వారాల్లో, మెట్రోలు, టయర్-1 నగరాల్లోని ఆస్పత్రులకు, క్రమంగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని వివరించింది. కేంద్ర రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‍డీవో)కు చెందిన న్యూక్లియర్ మెడిసిన్, అల్లయిడ్ సైన్సెస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కలిసి ఈ ఔషధాన్ని అభివృద్ధి చేశాయి.