రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలి… లేదంటే తామే కేంద్ర ప్రభుత్వాన్ని
సికింద్రాబాద్ అల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఘటనకు టీఆర్ఎస్ రాజకీయ వ్యూహకర్త అని చెప్పుకుంటున్న ప్రశాంత్ కిషోర్‌కు సంబంధం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే తామే కేంద్ర ప్రభుత్వాన్ని విచారణ కోరుతామని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున అల్లర్లు జరగనున్నాయనే సమాచారాన్ని ముందుగానే తెలుసుకోకుండా నిఘా విభాగం ఏమి చేస్తోందని ప్రశ్నించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి పెట్రోల్ బాటిల్స్ ఎలా వచ్చాయని నిలదీశారు. ముమ్మాటికీ ముందస్తు వ్యూహాంలో భాగంగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అల్లుర్లు జరిగాయని అన్నారు.













