దిశ కేసులో కీలక పరిణామం
దిశ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి విచారణ అధికారిగా పనిచేసిన సురేంద్ర స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు డీజీపీ అంజనీ కుమార్కు వీఆర్ఎస్ దరఖాస్తును సమర్పించారు. ఇటీవల తరచుగా జరుగుతున్న బదిలీలపై అసంతృప్తి కారణంగానే సురేంద్ర వీఆర్ఎస్కు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సైబరాబాద్ సైబర్ క్రైమ్ విభాగానికి సురేంద్ర బదిలీ అయ్యారు. అంతకుముందు ట్రాన్స్కో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీగా ఆయన పని చేశారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ సమయంలో షాద్నగర్ ఏసీపీగా సురేంద్ర ఉన్నారు.













