దిశ కేసులో కీలక మలుపు
ఇటీవల సంచలనం రేపిన దిశ హత్యాచారం కేసుపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిది. మహబూబ్‌నగర్‌లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతంలో దిశా అనే వెటర్నరీ డాక్టర్‌పై నలుగురు దుండగులు ఘోరంగా హత్యాచారం చేశారు. ఈ ఘోర ఘటనపై సమాజంలోని ప్రతి వ్యక్తి స్పందించారు. అఘాయిత్యానికి పాల్పడిన దోషులకు వెంటనే ఉరిశిక్ష వేయాలనీ, నడిరోడ్డుపై వారిని చంపేయాలని వారు తమ ఆక్రోషాన్ని వెల్లగక్కిన విషయం తెలిసిందే.













