గురువులు ఎంత గొప్ప వాళ్లతే.. సమాజం కూడా : డిప్యూటీ సీఎం భట్టి

గురువులకు ఈ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 41మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలోని మొత్తం 27,862 ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో వరదల సమస్యల వల్ల సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారని తెలిపారు. ప్రస్తుత కంపెనీల అవసరాలకు అనుగుణంగా మన విద్యావ్యవస్థ లేదు. మన రాష్ట్ర విద్యా వ్యవస్థ ఇంకా మారాల్సి ఉంది. విద్యార్థుల్లో నైపుణ్యాలు, పెంచేందుకే నైపుణ్య యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నాం. రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయంగా పోటీ పడేలా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. సమాజాన్ని సన్మార్గంలో పెట్టడంలో గురువులది కీలకపాత్ర. అదృష్టం కొద్దీ మన రాష్ట్రంలో ఆదర్శమైన గురువులు ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను మన గురువులు చక్కగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసినప్పుడు చక్కగా సహకరించారు. గురువులు ఎంత గొప్ప వాళ్లైతే సమాజం కూడా అంత గొప్పగా మారుతుంది అని అన్నారు.