రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా దీపికా రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా దీపికా రెడ్డి నియామకం అయ్యారు. ఆమె రెండేండ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1965, సెప్టెంబర్ 15న జన్మించిన దీపికారెడ్డి నాటక రంగంలో అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం ఆమె కూడిపూడి నాట్యకారిణిగా, కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతున్నారు. నేషనల్ సంగీత అకాడమీ అవార్డును 2017లో నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. అదే విధంగా 2016లో తెలంగాణ స్టేట్ అవార్డును సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దీపికా రెడ్డి అందుకున్నారు.













