జపాన్ సదస్సులో పెద్దపల్లి విద్యార్థిని
జపాన్ రాజధాని టోక్యో వేదికగా ఈ నెల 5 నుంచి వారం రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ సకూర కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థిని దాసరి హర్షిత (పదో తరగతి) హాజరైంది. 9వ ఇన్స్పైర్ మానక్ అంతర్జాతీయ వైజ్ఞానిక సదస్సుకు ఆమె ఎంపికైన సంగతి విదితమే. దేశ, విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులు, అతిథులకు తాను రూపొందించిన బహుళ ప్రయోజనకర శిరస్త్రాణం ప్రయోజనాలను వివరించారు. గ్రామీణ ప్రాంతం నుంచి అంతర్జాతీయ వైజ్ఞానిక సదస్సులో పాల్గొనడం జిల్లాకే గర్వకారణమని జిల్లా విద్యాధికారి మాధవి, జిల్లా సైన్స్ అధికారి రవినందన్రావు తెలిపారు.













