పాస్ పోర్టు సేవలు మరింత వేగం : దాసరి బాలయ్య
పాస్‌పోర్టు జారీకి సేవలు మరింత వేగంగా నిర్వహించాలని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య, చీఫ్ పాస్‌పోర్టు మాస్టర్ జనరల్ డాక్టర్ పీవీఎస్ రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మేడ్చల్‌లోని పీవోఎస్పీకే వద్ద కమ్యూనికేషన్ నిర్మాణం, ఇతర మానవ వనరుల విస్తరణ వంటి పలు అంశాలపై చర్చించినట్లు వివరించారు. పాస్‌పోర్టులు, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్లకు సంబంధించి సగటున 735 దరఖాస్తులను పరిష్కరిస్తున్నట్టు తెలిపారు. ప్రతిరోజూ మూడు వేల పాస్‌పోర్టులను ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయంలో స్పీడ్‌పోస్టు ద్వారా జారీ చేస్తున్నట్టు పేర్కొన్నారు.













