భారత్ బయోటెక్ కు మరో అంతర్జాతీయ గుర్తింపు…

భారత్ బయోటెక్ కంపెనీకి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. భారత్ బయోటెక్ కంపెనీ కోవాగ్జిన్ కోవిడ్ టీకాలను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ కంపెనీకి గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) సర్టిఫికేట్‍ను హంగేరి అధికారులు ఇచ్చారు. హంగేరికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసీ అండ్ న్యూట్రిషన్ కోవాగ్జిన్‍కు ఈ గుర్తింపును ఇచ్చింది. ఎడురాజీఎండీపీ డేటాబేస్‍లో ఇక ఆ సర్టిఫికేట్ ఉంటుంది. యూరోప్ దేశాల్లో వ్యాక్సిన్ ఉత్పత్తిదారులకు కోవాగ్జిన్ అందుబాటులోకి వస్తుంది. ఈ గుర్తింపుతో ప్రపంచ స్థాయిలో భారత్ బయోటెక్ సంస్థలు టీకాలు ఉత్పత్తి చేస్తున్నట్లు మరో మైలురాయిని అందుకుందని ఓ ప్రకటనలో ఆ కంపెనీ తెలిపింది.
కోవిడ్ పోరాటంలో తమ కంపెనీ ముందుందని, హంగేరి ఇచ్చిన గుర్తింపు వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ధిలో నాణ్యతను చాటుతుందని భారత్ బయోటెక్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని దేశాల్లో కోవాగ్జిన్ ఎమర్జెన్సీ వాడకం కోసం కంపెనీ దరఖాస్తు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.