హైదరాబాద్‌లో థర్డ్‌వేవ్ వచ్చినట్లేనా?
                                    హైదరాబాద్‌లో గత 2,3 రోజులుగా కోవిడ్ కేసులు బాగా పెరగడంతో థర్డ్‌వేవ్ ప్రారంభమైనట్లేనని భావిస్తున్నారు. ఒకవైపు డెల్టా.. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్లు గ్రేటర్‌వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. క్రిస్మస్, డిసెంబర్ 31 వేడుకల తర్వాత రికార్డు స్థాయిలో కేసులు నమోదువుతుండటం, చికిత్స కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో తారస్థాయికి చేరిన కేసులు.. ఆగస్టు తర్వాత తగ్గుముఖం పట్టాయి. డిసెంబర్ మూడో వారం నుంచి మళ్లీ కేసుల సంఖ్య పెరుతూ వచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మూడు రోజుల క్రితం.. 397 పాజిటివ్ కేసులు నమోదైతే.. తాజాగా బుధవారం ఒక్కరోజే 1,285 మందికి వైరస్ నిర్ధారణ కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలా ఉంటే ఈ కేసులు పెరగకుండా అవసరమైన చర్యలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ చేపట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది.







