గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా విజృంభణ!
                                    గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలో మరోసారి కోవిడ్ విజృంభిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఒక్కరోజే 482 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 397 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. డిసెంబర్ మూడో వారం వరకు రోజుకు సగటున వందలోపు కేసులు నమోదు కాగా, నాలుగో వారంలో క్రిస్మస్ వేడుకలు, డిసెంబర్ 31 తర్వాత వైరస్ మరింత వేగంగా విస్తరించింది. గతంలో ఎన్నడూ లేనంతగా కరోనా కేసులు పెరుగుతుండటంతో విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.







