తెలంగాణలో 18 కరోనా కేసులు : ఈటల
తెలంగాణలో మరొక రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. తెలంగాణలో ఇప్పటి వరకూ మొత్తం 18 కేసులు నమోదయ్యాయని ఆయన అన్నారు. అయితే వీరెవరికీ ప్రాణాపాయం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో నివసిస్తున్న వారికి ఎవరికీ కరోనా సోకలేదని ఆయన అన్నారు. విదేశాలనుంచి వచ్చిన వారే కరోనా బారిన పడ్డారని ఆయన చెప్పారు. కరోనా విషయంలో అన్నింటికంటే నివారణ చర్యలే ముఖ్యమని, కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను కేంద్రం ప్రశంసించిందని ఆయన అన్నారు. ఎంతమందినైనా క్వారంటైన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. బాధితులు పెరిగితే ఏం చేయాలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు.













