తెలంగాణలో కొత్తగా 1,417 కేసులు…

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,24,430 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 1,417 మందికి కరోనా పాజిటివ్‍గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో మరో 12 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,546 మంది కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,10,834 చేరింది. 24 గంటల్లో 1,897 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 19,029 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా జీహెచ్‍ఎంసీ పరిధిలో 149, రంగారెడ్డిలో 104, ఖమ్మంలో 93, నల్లగొండలో 88, కరీంనగర్‍లో 87, సూర్యాపేటలో 85 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.