తెలంగాణలో తగ్గుముఖం పట్టిన.. కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 1,19,464 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,492 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 13 మంది మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 19,521 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 3,534 మంది మరణించారు. 24 గంటల్లో 1,933 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 5,86,362 మంది కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు వైద్యారోగ్య శాఖ 1,71,90,350 నమూనాలను పరీక్షించింది.