తెలంగాణలో కొత్తగా 1,511 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,511 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో 12 మంది మరణించారు. కరోనా నుంచి మరో 2,175 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 20,461 గా ఉంది. గడిచిన 24 గంటల్లో 1,10,681 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్‍ఎంసీ పరిధిలో అత్యధికంగా 173 కేసులు, ఖమ్మంలో 139, నల్గొండలో 113 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1.36 శాతం కరోనా పాజిటివిటీ రేటు.