తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా….

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 1,38,182 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,070 మందికి కొవిడ్ పాజిటివ్‍గా తేలింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,89,734కి చేరింది. తాజాగా మరో 18 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మొత్తం 3,364 మంది మరణించారు. కరోనా నుంచి 3,762 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29,208 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.