తెలంగాణలో 90వేలకు చేరుకున్న పాజిటివ్.
తెలంగాణ రాష్ట్రంలో కొరొనా పాజిటివ్ కేసుల సంఖ్య 90వేలకు చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1863 కొరొనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే కొత్తగా 10 మరణాలు చోటు చేసుకున్నాయి. వీటితో కలిపి శనివారం నాటికి మొత్తం మరణాల సంఖ్య 684కి చేరింది. హైదరాబాద్ జిహెచ్ఎమ్సి పరిధిలో 394, మేడ్చెల్ లో 174, కరీంనగర్లో 104, వరంగల్ అర్బన్ లో101, రంగారెడ్డి లో 131, సిరిసిల్లలో90, సంగారెడ్డిలో81, జగిత్యాలలో61, సిద్దిపేటలో60 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కొరోనా సోకి కొత్తగా కొలుకున్న వారి సంఖ్య 1912 కాగా ఇప్పటి వరకూ కొలుకున్నవారి మొత్తం సంఖ్య-66 196 ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆక్టీవ్ కేసులు- 23 379. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కొరొనా పాజిటివ్ కేసుల సంఖ్య- 90 259 చేరినట్లు వైద్యశాఖ ప్రకటనలో వెల్లడించింది.






