తెలంగాణలో కొత్తగా 3,982 కేసులు..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 71,616 మందికి పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 3,982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 5,186 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 48,110 కేసులు యాక్టివ్‍గా ఉన్నాయి. తాజాగా మరో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3,012కి పెరిగింది. జీహెచ్‍ఎంసీ పరిధిలో 607 పాజిటివ్ కేసులు నమోదు కాగా, రంగారెడ్డి, 262, ఖమ్మం 247, మేడ్చల్ జిల్లాలో 225 కేసులు నమోదు అయ్యాయి.