తెలంగాణలో కొత్తగా 987 కరోనా కేసులు..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 1,21,236 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 987 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 6,22,593కు పెరిగాయి. 24 గంటల్లో ఏడుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,651 మంది మృతి చెందారు. 24 గంటల్లో 1,362 మంది బాధితులు కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,05,455కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,487 యాక్టివ్ కేసులు ఉన్నాయి.