తెలంగాణలో కొత్తగా 1,175 కేసులు… 10 మంది

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,24,907 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,175 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,15,574కు చేరింది. 24 గంటల వ్యవధిలో 10 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 3,598 మంది మరణించారు. 24 గంటల్లో 1,771 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 5,95,348కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,640 యాక్టివ్ కేసులు ఉన్నాయి.