తెలంగాణలో కొత్తగా 1,197 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 1,19,537 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,197 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి వారి సంఖ్య 6,14,399 కి చేరింది. తాజా 1,709 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 5,93,577కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 17,246 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో 9 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3,576కు చేరింది. జీహెచ్‍ఎంసీ పరిధిలో కొత్తగా 137, నల్గొండలో 84, సూర్యాపేటలో 72, మేడ్చల్, మల్కాజ్‍గిరి, భదాద్రి కొత్తగూడెంలలో 71 కరోనా కేసులు నమోదయ్యాయి.