స్రవంతి వైపే కాంగ్రెస్ మొగ్గు?
మునుగోడు ఉప ఎన్నికలో పాల్వాయి స్రవంతి అభ్యర్థిత్వానికే కాంగ్రెస అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక నేతల మద్దతు, సర్వేలు అనుకూలంగా ఉండడంతో పాటు స్రవంతి కుటుంబ నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే అంగ్ల, అర్థ బలం ఉన్న అధికార బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులను దీటుగా ఎదుర్కొనేందుకు వ్యాపారవేత్త చెలిమల కృష్ణారెడ్డి అభ్యర్థిత్వాన్నీ టీపీసీసీ ముఖ్య నేతలు బలంగా ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. మరోవైపు బీజేపీ టీఆర్ఎస్ రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థులనే నిలుపుతున్న పరిస్థితుల్లో బీసీ అభ్యర్థిని ఖారారు చేయాలన్న ప్రతిపాదనా అధిష్ఠానికి కొందరు నేతలు బలంగా పెట్టినుట్ల చెబుతున్నారు. ఈ కోణంలోనూ అధిష్ఠానం ఆలోచన చేసినట్లు టీపీసీసీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. ఈ నెలాఖరులోగా అభ్యర్థి పైన అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.













