ఫలించిన కాంగ్రెస్ రాయబారం.. పలు చోట్ల వెనక్కి తగ్గిన
పార్టీ అధిష్ఠానం బుజ్జగింపులు, హామీలతో పలుచోట్ల కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థులు వెనక్కి తగ్గారు. తాము వేసిన నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇతర అవకాశాలు కల్పిస్తామని పార్టీ ముఖ్య నేతలు స్పష్టమైన హామీ ఇవ్వడంతో సూర్యాపేటలో పటేల్ రమేశ్ రెడ్డి, ఇబ్రహీంపట్నంలో దండెం రామిరెడ్డి, జుక్కల్‌లో గంగారం, బాన్సువాడలో బాలరాజు, డోర్నకల్‌లో నెహ్రు నాయక్, వరంగల్ వెస్ట్‌లో జంగా రాఘవరెడ్డి, నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి రెబెల్స్ బెడద తప్పినట్లయింది. నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది.













