వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా.. కడియం కావ్య

వరంగల్ లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కడీయం కావ్యకు కేటాయించింది. ఈ మేరకు ఏఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆ అవకాశాన్ని వదులుకొని తండ్రి కడియం శ్రీహరితో పాటు కాంగ్రెస్‌లో చేరిన ఆమెకు అనుకున్నట్లుగానే సీటు కేటాయించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 14 సీట్లకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.