ప్రధాని మోదీని కలిసిన ఎంపీ కోమటిరెడ్డి
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. నాలుగు అంశాలపై ఆయన ప్రధాన మంత్రికి విజ్ఞాపన పత్రాలు అందజేయడంతో పాటు, తెలంగాణలోని పలు ప్రాజెక్టులో వందల కోట్ల మేర అవినీతి జరుగుతోందని ఫిర్యాదు చేసినట్టు సమచారం. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.64 వేల కోట్ల రుణం తీసుకుని, ఆ నిధులను యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రాజెక్టు నిర్మాణంలో నామినేషన్ల ద్వారా కొన్ని కంపెనీలకు కట్టబెట్టారని ఫిర్యాదు చేసినట్టు సమచారం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భారీఎత్తున అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరిపించాలని కోరినట్టు సమాచారం.













