తెలంగాణ కాంగ్రెస్ లో మార్పులు…?
కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ తెలంగాణాపై ప్రత్యేక ద ష్టి సారించినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోవా లనే పట్టుదలతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పెద్ద కసరత్తే చేస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఏఐసీసీ లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టిన రాహుల్‌గాంధీ.. ఇక రాష్ట్ర కాంగ్రెస్‌లోనూ భారీ మార్పులు చేయాలనే యోచన లో ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. గుజరాత్, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలు ఇప్పటికే యువతకు అప్పగించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందే పార్టీ పదవుల్లో భారీ మార్పులు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. టీ పీసీసీ చీఫ్‌తో పాటు అసెంబ్లిలో ప్రధాన ప్రతిపక్ష నేతను సైతం మార్చే అవకాశా లు ఉన్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఇటీవల రాష్ట్రంలో జరుగు తున్న పరిణామాలపై పార్టీ హై కమాండ్ రాష్ట్ర ముఖ్య నేతలపై గుర్రుగానే ఉన్నట్లుగా పార్టీకి చెందిన ఒ క సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగు తున్న నేపధ్యంలో.. వచ్చే ఏడాదిలో తెలంగాణాలోనూ విజయం సాధించాలంటే నూతన జట్టు అవసరమన్న అభిప్రాయానికి రాహుల్‌గాంధీ వచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీ పదవుల నియామకంలో సామాజిక న్యాయంతో పాటు ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలని పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నదని చెబుతున్నారు. ప్రస్తుతం టీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియ మించి.. అదే సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళా నేతకు పార్టీ పగ్గాలు అప్పగించే యోచనలో కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ వర్గాలు చెబు తున్నాయి. టీ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు కూడా ఏఐసీసీలోనే కీలక పదవి అప్పగి స్తారని అంటున్నారు. ఇక టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని బీసీ వర్గానికి కట్ట బెట్టాలని ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. ఈ పదవిని తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన ఒక మాజీ ఎంపీని వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల్లో ఇద్దరిని నియమించాల్సి వస్తే ఎస్టీ సామా జిక వర్గానికి అవకాశమిస్తారని అంటున్నారు. పార్టీ ప్రచార కమిటికి చైర్మన్‌గా టీఆర్ఎస్ పార్టీపై పదునైన విమర్శలు చేసే కీలక నేతను నియమించే అవకాశం ఉన్నట్లుగా పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత చెప్పారు.













