అమెరికాలో ఘనంగా కాంగ్రెస్ వంద రోజుల వేడుకలు

తెలంగాణలో కాంగ్రెస్ పాలన పగ్గాలు చేపట్టి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలోని సియాటెల్ నగరంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణ నేషనల్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్, సియాటెల్ ఐవోసీ అధ్యక్షుడు రాహుల్ సూర్యోదయ, సియాలెట్ ఐవోసీ నేతలు యశ్వంత్ రిషి, సాయిచరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా తెలంగాణ అమరవీరులు, ప్రజా గాయకుడు గద్దర్‌కు నివాళి అర్పిస్తూ వేడుకను ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర్‌రెడ్డి హాజరు కాగా, వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కుమార్తె డాక్టర్ గోదా నాయిని కూడా పాల్గొన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన ప్రజారంజకంగా సాగుతోందని జగదీశ్ రెడ్డి కొనియాడారు. ఎన్‌ఆర్‌ఐల కోసం తాను మధ్యవర్తిగా వ్యవహరించి సమస్యలను ప్రభుత్వానికి చేరువేస్తానని తెలిపారు.