Revanth Reddy: గవర్నర్ కు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma)కు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్భవన్లో గవర్నర్ను సీఎం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. గత రెండేళ్ల పాలన ఎంతో సంతృప్తిగా సాగిందని, ఈ ఏడాది కూడా ప్రజా సంక్షేమ పథకాలు మరింత సమర్థంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్సిటీతో (Future City)పాటు ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల గురించి సీఎం వివరించారు. నూతన సంవత్సరంలో సీఎం మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు.






