అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిన సీఎం కేసీఆర్
అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో సమర్పించే చాదర్ (గిలాఫ్)ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంప్రదాయబద్ధంగా సాగనంపారు. దర్గాలో సమర్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన చాదర్‌ను ముస్లిం మతపెద్దలు ప్రగతిభవన్‌లో కేసీఆర్ ముందు ప్రదర్శించారు. ఈ సందర్భంగా మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయ రంగంలో పురోగమించాలని, కేసీఆర్ కుటుంబం సంపూర్ణ ఆరోగ్యంతో పరిపూర్ణ జీవితం గడపాలని వారు ప్రార్థించారు. ఆజ్మీర్ దర్గా ఉత్సవాల సంద్భంగా ముస్లింలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, వక్ప్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం, ఎమ్మెల్సీలు మహ్మద్ ఫరీదుద్దీన్, ఫరూక్ హుస్సేన్, ఎమ్మెల్యే షకీల్, టీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాజా ముజిబీద్దిన్, మైనార్టీ నేతలు ముఫ్తీ సయ్యిద్, కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.













