సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు… రోజుకు మూడు సార్లు
కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతిరోజూ మూడు సార్లు సమీక్షించి పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కరోనా చికిత్స, పడకలు, ఔషధాలు, ఆక్సిజన్ వ్యాక్సిన్ల విషయంలో ఎలాంటి సమస్యలు రాకూడదని సీఎస్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. రెమ్‌డెసివర్ వంటి ఔషధాలు, ఆక్సిజన్, పడకలు, వ్యాక్సిన్ల లభ్యత విషయంలో ఎలాంటి లోపం జరగకూడదన్నారు. అనుక్షణం కరోనా పర్యవేక్షణకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కార్యదర్శి రా•శేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి నియమించారు. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి నుంచి బయటపడేయాలని సీఎం సూచించారు. ఈటల రాజేందర్ వద్ద ఉన్న వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్ తన ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈటలపై భూకబ్జాల ఆరోపణల నేపథ్యంలో వైద్యారోగ్య శాఖను తనకు కేటాయించాలని గవర్నర్‌కు సీఎం కేసీఆర్ సిఫారసు చేశారు. సీఎం సిఫారసుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. ఇక వైద్యారోగ్య శాఖ తన ఆధీనంలోకి రావడంతో కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు. ఆ చర్యల్లో భాగంగానే తన కార్యదర్శి రాజశే•ర్ రెడ్డిని కరోనా పర్యవేక్షణకు నియమించారు.













