గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభించిన సీఎం
జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మొదట తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. పండితుల వేద మంత్రోచ్చరణాల మధ్య శిలాఫలకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్ కట్ చేసి పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గద్వాల జిల్లా పార్టీ ఇంచార్జి బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని కూర్చీలో కూర్చోబెట్టారు కేసీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అంబ్రహం, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్య యాదవ్, శాట్స్ చైర్మన్ ఆంజనేయులు గౌడ్‌తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.













