తెలంగాణను అభివృద్ధి చేసింది టీడీపీనే: చంద్రబాబు
తెలంగాణను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఐటీ స్థాపించాం. అప్పట్లో సెల్ఫోన్ బువ్వ పెడుతుందా అని ఎగతాళి చేశారు. ఇప్పుడు సెల్ఫోన్ లేకుండా భార్యభర్తలు కూడా ఉండలేరు అన్నారు. ఎన్టీఆర్ తెలుగుజాతి గౌరవాన్ని నిలబెట్టారు. తెలుగు ప్రజలకు ఆయన ఒక ధైర్యం, ఆయన విగ్రహం ముందు తీసుకున్న ఏ సంకల్పం అయినా నెరవేరుతుంది. త్వరలో దివంగత నేత 100వ పుట్టినరోజు ఘనంగా జరపనున్నాం. టీడీపీ స్థాపించి 40 ఏళ్లు కావస్తోంది. తెలుగు వాళ్లు ఎక్కడ ఉన్నా వారి అభివృద్ధి కోసం పని చేస్తే పార్టీ టీడీపీ. అది తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, మీ అభిమానాన్ని గుర్తించుకుంటా అని తెలిపారు.













