కేసీఆర్ ను పరామర్శించిన చంద్రబాబు
బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీలైనంత త్వరగా కోలుకొని ప్రజా సేవకు రావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను చంద్రబాబు పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి వెలుపల చంద్రబాబు మాట్లాడుతూ కేసీఆర్ త్వరగా కోలుకుంటున్నారని చెప్పారు. ఆయనతో మాట్లాడాలనిపించి వచ్చాను. కోలుకోవడానికి ఆరువారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. వైద్యులు చాలా చక్కగా ఆపరేషన్ చేశారు. త్వరలోనే కేసీఆర్ మామూలుగా నడుస్తారు అని అన్నారు.













