చంద్రబాబుకు క్యాటరాక్ట్ ఆపరేషన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్యులు క్యాటరాక్ట్ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పటికే రెండు సార్లు గౌచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నాలుగు రోజుల క్రితం ఏఐజీకి వచ్చిన చంద్రబాబు ఒకరోజు అక్కడే ఉండి పలు వైద్య పరీక్షలు చేయించుకొని ఇంటికి వెళ్లారు. సోమవారం మరోసారి ఆస్పత్రికి వెళ్లిన ఆయనకు వైద్యుల బృందం వివిధ వైద్య పరీక్షలు చేయడంతో పాటు చర్మ సంబంధిత చికిత్స అందించింది. ఇవాళ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో క్యాటరాక్ట్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు.













