బీఆర్ఎస్ మాజీ ఎమెల్యే జీవన్ రెడ్డికి షాక్

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. భూ కబ్జా చేసి, అనుచరులతో బెదిరించారని సామ దామోదర్ రెడ్డి ఫిర్యాదు మేరకు జీవన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపైనా కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా ఈర్లపల్లి గ్రామంలో సర్వే నెంబరు 32, 35, 36, 38లో 20 ఎకరాల 20 గుంటల భూమిని సామ దామోదర్ రెడ్డికి కొనుగోలు చేశారు. అతని తండ్రి పరమ్‌రెడ్డి పేరుతో ఫంక్షన్ హాల్ నిర్మించారు. 2023లో జీవన్ రెడ్డి, అతని అనుచరులు ఫంక్షన్ హాల్ కూల్చివేసి మరో భవనం నిర్మించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విషయం తెలిసి అక్కడకు వెళ్లిన తమను బెదిరించారని, బిహార్, పంజాబ్‌కి చెందిన గ్యాంగ్‌ను వాచ్‌మెన్‌లుగా పెట్టుకున్నారని తెలిపారు. రెండ్రోజుల క్రితం తమ భూమిలోకి వెళితే, మారణాయుధాలతో బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.