శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో తిహాడ్ జైలులో ఉన్న ఆమె బెయిల్ మీద విడుదలైన విషయం తెలిసిందే. శంషాబాద్‌కు చేరుకున్న కవితకు గులాబీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా గులాబీ నేతలు, కార్యకర్తలు కవితపై పూలవర్షం కురిపించగా, పార్టీ శ్రేణులకు కవిత అభివాదం చేశారు. పడికిలి బిగించి జై తెలంగాణ అంటూ నినదించారు. కార్యకర్తల జై తెలంగాణ నినాదాలతో ఎయిర్‌పోర్ట్ దద్దరిల్లింది. ఐదున్నర నెలల తర్వాత కవిత హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆమె వెంట బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, భర్త అనిల్‌తో పాట పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు. కవిత ఎయిర్‌పోర్టు నుంచి ర్యాలీగా బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.