మేము సిద్ధం… మరి వారికి ఎందుకు భయం? : లక్ష్మణ్
తప్పు చేయనివాళ్లు భయపడాల్సిన అవసరం లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐటీ దాడులు కొత్త కాదని, దీన్ని రాజకీయానికి ముడిపెట్టి డైవర్ట్ చేయడం సరికాదన్నారు. రాజకీయంగా బీజేపీని ఎదుర్కోలేక కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాము రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడిరచారు. తెలంగాణ ప్రభుత్వం ఎవరో నలుగురు పేర్లను అడ్డంగా పెట్టుకొని కావాలనే కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా అక్రమ సంపాదించిన వారు, పన్ను ఎగవేతదారులపై దాడి చేసి లెక్కలు బయటకు తీయడమే ఐటీ సంస్థల పని అన్నారు. ఏమి తప్పు చేయనివారు ఎందుకు భయపడటం? ఐటీ సోదాల్లో నోట్ల కట్టలు వెలుగులోకి వస్తుంటే వాటికి లెక్కలు చూపించాల్సిన బాధ్యత మీపై ఉంది. కానీ రాజకీయ విమర్శలతో తప్పించుకోవాలని చూడటం సరికాదన్నారు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది అని అన్నారు.













