టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గుణపాఠం : అరవింద్
డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని భావించిన టీఆర్ఎస్కు ప్రజలు గుణపాఠం చెప్పారని బీజేపీ ఎంపీ ధర్మపూరి అర్వింద్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పతనానికి నాంది పడిరదని అన్నారు. టీఆర్ఎస్లో పెద్ద ఎత్తున ముసలం పుట్టుబోతోందన్నారు. హుజూరాబాద్‌లో బీజేపీకి 20 వేల మెజార్టీ వస్తుందన్నారు. కేసీఆర్ చేసిన అవినీతి పాపాలే ఆయన్ను చుట్టముట్టాయి. అహంకారమే ఆయన్ను దహించివేసిందన్నారు. కేసీఆర్ చరిత్రలో మిలిగిపోయే రోజు ఇవాల్టి నుంచి మొదలైందన్నారు. టీఆర్ఎస్ పార్టీ అస్తవ్యస్తం కాబోతుందన్నారు. తెలంగాణ ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వంలో నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వంలోకి అతి త్వరలో రాబోతున్నారు. నిజమైన బంగారు తెలంగాణ అన్నది కేవలం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సాధ్యం అని అన్నారు.













