తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజేపీనే
బీజేపీని గెలిపిస్తేనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమని బీజేపీ సీనీయర్ నేత మురళీధర్‌రావు చెప్పారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు ఎన్నికల జిమ్మిక్కులు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో సాధారణ పరిపాలన పూర్తి స్తంభించిందని, ఎన్నికలు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయా అనిపిస్తోందన్నారు. డిసెంబర్ 7 తర్వాత వరద సాయం అన్నారు ఏమైంది? అని ప్రశ్నించారు. ఎన్నికలు లేవనే వరంగల్‌లో వరద సాయం ఇవ్వలేదా అని నిలదీశారు. ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రకటన చేశారని విమర్శించారు. దుబ్బాకలో ఓడిన తర్వాత టీఆర్ఎస్లో గెలపుపై నమ్మకం పోయిందని అన్నారు.
కరోనాతో ప్రైవేట్ స్కూళ్లల్లో పనిచేస్తున్న 6 లక్షలమంది రోడ్డునపడ్డారని దుయ్యబాట్టారు. ప్రవేట్ పాఠశాలపై పరోక్షంగా ఆధారపడిన వారికి ఉపాధి పోయిందన్నారు. చార్మినార్ తెలంగాణకు బాసింగం కాదని, కాకతీయ తోరణం తెలంగాణ అస్తిత్వమని తెలిపారు. కాకతీయుల ప్యూడలిజం ప్రవేశపెట్టలేదని, గొలుసు చెరువులతో అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఆదుకుంటున్నారని, అమ్మ ఒడి పేరుతో తల్లిదండ్రులకు ఫీజు రీయింబర్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పని ఎప్పుడో అయిపోయింంది. దానికి డ్రైవర్ లేదు, స్టీరింగ్ లేదు. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజేపీనే అని అన్నారు.













