తెలంగాణ తరహాలోనే ఏపీలోను షాక్ ట్రీట్మెంట్
తెలంగాణలో ఉద్యమకారులు కనుమరుగయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ పంచన చేరినవాళ్లు తెలంగాణ ద్రోహులేనని చెప్పారు. ప్రముఖ కళాకారుడు దరువు ఎలన్న బీజేపీలో చేరిన సందర్భంగా సంజయ్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులు అధికారంలో ఉండొద్దా? అని ఆయన ప్రశ్నించారు. ఆంధప్రదేశ్‌లోని ఆలయాల్లో విగ్రహాల ధ్వంసంపై సంజయ్ మండిపడ్డారు. ఏపీ ప్రజల సహానాన్ని పిరికితనంగా భావించొద్దని సీఎం జగన్‌ను ఉద్దేశించి అన్నారు. బీజేపీ కార్యకర్తలు రొడ్డెక్కితే ఆయన మూటముల్లె సర్దుకోవాలని ధ్వజమెత్తారు.
తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ షాక్ ట్రీట్మెంట్ తప్పదని సంజయ్ హెచ్చరించారు. తిరుపతి ఉప ఎన్నికలో ఓటేసే ముందు ప్రజలు ఆలోచించాలన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలే తిరుపతిలోనూ వస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా సంజయ్‌కు ఉద్యమ చరిత్ర పుస్తకాన్ని ఎల్లన్న బహుకరించారు. యుద్దంలో సంజయ్‌తోనే ఉండాలని బీజేపీలో చేరినట్లు ఆయన చెప్పారు.













