తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తాం : బండి సంజయ్
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం బంజారా తండాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా మాట్లాడుతూ ఈ యాత్రలో తనకు ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున వారి సమస్యలను విన్నవిస్తున్నారని అన్నారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిర్మల్లో భారీ బహిరంగ సభ నిర్వహించనునన్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ సభకు హాజరవుతారన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దరిద్ర, దీన సిత్థిలో కేసీఆర్ ప్రభుత్వం ఉందని అన్నారు. తెలంగాణ మొట్ట మొదటి ద్రోహి కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ నయా నిజామని దుయ్యబట్టారు. కేంద్రం నిధులివ్వకపోతే టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు పార్లమెంటులో ప్రశ్నించటం లేదని ప్రశ్నించారు. పాతబస్తీలో అడుగుపెట్టే ధైర్యం కేసీఆర్కు, టీఆర్ఎస్ లేదన్నారు. ఢల్లీిలో వంగివంగి మొక్కిన పిరికోడు కేసీఆర్ అని మండిపడ్డారు. తన యాత్రలో ప్రజలకు నిజాలు వివరిస్తున్నామని అన్నారు. ఇకపై టీఆర్ఎస్ నేతలు అవాకులు, చవాకులు పేలితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.













