హైదరాబాద్ లో బిజెపి అధ్యక్షుడు అమిత్ షాకు ఘనస్వాగతం
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కొద్దిసేపటి క్రితం ప్రత్యేక విమానంలో పట్నా నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అమిత్ షాకు స్వాగతం పలికేందుకు నాయకులు, కార్యకర్తలు, భాజపా శ్రేణులు, పెద్ద సంఖ్యలో వచ్చారు. విమానాశ్రయం ప్రాగణంలో కార్యకర్తలకు అభివాదం చేసిన అనంతరం ఆయన రాష్ట్ర కార్యాలయానికి బయల్దేరి వెళ్లారు. ఆయనతో పాటు భాజపా జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ఇతర నేతలు ఉన్నారు.
తెలంగాణలో భాజపాను బలోపేతం చేయటమే లక్ష్యంగా అధిష్టానం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో పదాధికారులు, బూత్ స్థాయి నేతలు, నియోజవర్గం ఇన్ఛార్జ్ లతో అమిత్ షా సమావేశం అవుతారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికలను ద ష్టిలో ఉంచుకుని.. ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా.. అధికార తెరాసను ఎదుర్కొని అధికారం కైవసం చేసుకోవటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కేంద్రంలో మళ్లీ మోదీ పగ్గాలు చేపట్టేలా.. రాష్ట్రంలోని ఎంపీ స్థానాలపై ప్రత్యేక దష్టి పెట్టారు. ముఖ్యంగా భాజపా అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు శక్తివంచన లేకుండా క షి చేయాలని మార్గనిర్దేశం చేయనున్నారు.













